Major victory – భారత ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్థాన్. కులభూషన్ జాదవ్ ఉరిశిక్ష వాయిదా

Share the Post

మొత్తానికి భారత ప్రభుత్వం ముందు చూపుతొ చేసిన ఒత్తిడికి,  పాకిస్థాన్ తలొగ్గింది.  కులభూషన్ జాదవ్ భార్య, తల్లి కి కులభూషన్ జాదవ్ తొ మాట్లాడేందుకు అంగీకరించిన పాకిస్థాన్, వారికి వీసా మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరు కులభూషన్ జాదవ్ ను కలిసి వెళ్ళిన తరువాత జాదవ్ ను ఉరితీద్దామని పాకిస్థాన్ భావించింది. అయితే ఈ విషయం ముందుగా పసిగట్టిన భారత ప్రభుత్వం నేరుగా పాకిస్థాన్ తొ పెద్ద ఎత్తున చర్చలు జరపుతూ, అటు అమెరికా నుండి, అంతర్జాతీయ కొర్టు నుండి పాకిస్థాన్ పై తీవ్ర ఒత్తిడి తేవడంతొ పాకిస్థాన్ దిగి వచ్చింది.

ఈ రొజు పాకిస్థాన్ విదేశాంగశాఖ కార్యదర్శి మొహమ్మద్ ఫైసల్ మాట్లాడుతూ, కులభూషన్ జాదవ్ కు ప్రాణాపాయం ఏమి లేదని, ఇప్పుడే ఉరి తీయమని, అందులొ అనుమానపడాల్సిన అవసరం లేదని తెలియజేశారు. తాము కేవలం మానవతా ద్రుక్పదంతొనే జాదవ్ తల్లి, భార్యలకు వీసా మమ్హూరు చేశామని, అంతేకాకుండా కులభూషన్ జాదవ్ క్షమాభిక్ష పిటిషన్ ను తాము తిరస్కరించలేదని, అది  ఇంకా తమ ద్రుష్టిలొ ఉందని తెలియజేయడం విశేషం

పొయిన సంవత్సరం భారత మాజీ నేవి అధికారి కులభూషన్ జాదవ్ ను పాకిస్థాన్ అరెస్టు చేసి, ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే భారత్ ఈ విషయంపై అంతర్జాతీయ న్యాయ స్థానానికి వెళ్ళి జాదవ్ ఉరి శిక్షను నిలిపి వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!