మరొక ఘనత సాధించిన భారత్, ఆవిష్కరణలలో 60వ స్థానం
ఇన్నొవేషన్స్ లొ భారత్ మరొక ఘనత సాధించింది. కొత్త ఆవిష్కరణలలొ భారత్ 60 వ స్థానానికి ఏగబాకింది. 2015 లో భారత్ 81 స్థానం లో ఉండగా, 2016 లో భారత్ 66 స్థానం లోకి వచ్చిన భారత్, 2017 లో భారత్ 60 స్థానం సంపాదించడం విశేషం. స్విట్జెర్లాండ్ లొని ప్రపంచ ప్రసిధ సంస్థ అయిన “వరల్డ్ ఇంటలెక్య్టువల్ ప్రాపరిటీ ఆర్జనైజేషన్” ఈ ర్యాంకులు ఇస్తుంది. ప్రధానంగా ఆవిష్కరణలకు మూల స్థంబాలయిన
కొత్త సంస్థలు,
మౌలిక సదుపాయాల కల్పన,
సృజనాత్మక,
వ్యాపారలో ఆదునీకత,
టెక్నాలజీ ….. లలొ మెరుగుదల ఆధారంగా ప్రపంచ దేశాలకు ఈ ర్యాంకులు ఇవ్వడం జరుగుతుంది. కాగా ఇందులొ స్విట్జెర్లాండ్ మొదటి స్థానం సంపాదించగా, అమెరికా నాలువ స్థానం సంపాదించింది.
ఈ ర్యాంకుల వలన ప్రధానంగా టెక్నాలజీ పరమైన విదేశీ కంపెనీలు దేశంలో స్థాపించుటకు మొగ్గుచూపుతాయి. మౌలిక పరమైన వసతులతో మల్టీనేషనల్ కంపెనీలు స్థాపనకు ముందుకు వస్థాయి. వ్యాపార ఆధునికరణతో దేశంలోకి విదేశి పెట్టుబడులు పెరుగడమే కాకుండా విద్యారంగంలో సాంకేతికత మెరుగుదల జరుగుతుంది.