Angel of Death : 1500 మంది ISIS తీవ్రవాదులను ఊచకొత కోసిన వీరుడు

Share the Post
ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ISIS కు Angel of Death అంటే వణికి చస్థారు. ఏ ప్రాంతంలొకైనా Angel of Death వచ్చాడంటే చాలు, మరొ మాట లేకుండా ISIS తీవ్రవాదులు అక్కడి నుండి తుర్రు మంటారు. 
 
“Angel of Death” అసలు పేరు ఆబు అజ్రాయిల్. కాని ఆ పేరు ఏవరికీ తెలియదు. Angel of Death అనే పేరు మాత్రం ప్రపంచమంతా మొగిపొతుంది. ఇతనికి మరొక ముద్దు పేరు కూడా ఉంది అదే “Iraq Rambo” … ఆబు అజ్రాయిల్, ఇరాక్ లొని షియా మిలీషియా గ్రూఫ్ అధినేత. ఇరాక్ లొ షియా ముస్లింసును చంపుతున్న ISIS ను వేటాడటానికి పుట్టిన సంస్థే ఈ షియా మిలీషియా సంస్థ. నిజానికి యూనివర్శిటీ లెక్చరర్ అయిన ఆబు అజ్రాయిల్, 2003 లొ అమెరికా, ఇరాక్ పై దండయాత్ర చేయడంతొ కదనరంగంలొకి దూకాడు. అమెరికా సైన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఏత్తున పొరాటం చేశాడు. అమెరికన్ల Most Wanted List లొ కూడా చేరాడు. అయితే తరువాత సద్దాం హుస్సేన్ ఉరి తీయబడటం, అమెరికా ఇరాక్ ను ఆక్రమించుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతొ అక్కడి పరిస్తితులు మారాయి.
 
ఈ పరిణామాల తరువాత ఇరాక్ లొ ఏర్పడిన ISIS తీవ్రవాద సంస్థ , అక్కడి షియాలను టార్గెట్ చేసి చంపుతుండటంతొ ఆబు అజ్రాయిల్ , “అల్-ఇమాం అలి” అనే షియా మిలిటెన్సీ సంస్థను స్థాపించాడు. అంతే ఇక వేట మొదలైంది. ఇరాక్, సిరియాలలొని తీవ్రవాదులను ఊచ కొత కొయడం మొదలుపెట్టాడు. ఇరాక్, సిరియా లలొ అనేక ప్రాంతాలను ISIS నుండి విముక్తి కలిగించాడు. ఇప్పటి వరకు అక్షరాల 1500 మంది ISIS తీవ్రవాదులను చంపిన అబు అజ్రాయిల్, తీవ్రవాదులను రైఫిల్ తొ కన్నా గొడ్దలి, మచాటి (మాంసం కొట్టడానికి ఉపయొగించే కత్తి)లతొనే ఏక్కువ మందిని చంపడం విశేషం.
 
ఇరాక్ లొ ఆబు అజ్రాయిల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యువతతొ పాటు చివరకు పొలీసులు, ఇరాక్ అర్మీ కూడా “అబు అజ్రాయిల్” తొ కలిసి సెల్ఫీలు దిగడానికి ఉత్సాహ పడుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!