వ్లాదిమిర్ క్రుగ్ల్యకొవ్, 1971 యుధంలొ భారత్ ను కాపాడిన రష్యన్ కమాండర్

Share the Post
వ్లాదిమిర్ క్రుగ్ల్యకొవ్ , మాజీ సొవియట్ రష్యా కు చెందిన రష్యన్ ఫసిఫిక్ కమాండర్. 1971 భారత్-పాకిస్తాన్ యుధంలొ పాకిస్తాన్ ఓటమి తప్పనిసరి అయిన పరిస్తితులలొ, పాకిస్థాన్ తనకు దగ్గర సంబందాలున్న అప్పటి అమెరికా రక్షణమంత్రి కిసింజర్ సహాయంతొ అమెరికా, పాకిస్తానుకు మద్దత్తుగా భారతదేశం పై దాడి చేయడానికి వొప్పించారు. అంతేకాకుండా ఈ యుద్ధంలొ పాకిస్థాన్ కు మద్దత్తుగా బ్రిటన్ కూడా భారత్ పై దాడి చేసేలా అమెరికన్ రక్షణమంత్రి కిసింజర్ ప్యూహం రచించారు. కిసింజర్ అంతటితొ ఆగకుండా చైనా మద్దత్తుకూడ తీసుకొవడం కొసం హుటాహుటీన చైనా పర్యటన చేసి చైనా ను కూడా భారత్ పై దాడి చేసే విధంగా ఒప్పించాడు. 
 
వెంటనే అమెరికా, బ్రిటన్ నేవీ లు భారత్ పై దాడి చేయడానికి రంగంలొకి దిగాయి. అమెరికా నుంది అప్పట్లొ అతిపెద్ద విమాన వాహక నౌక #USS_Enterprise (Nuclear) ను, బ్రిటన్ తన విమాన వాహక నౌక Eagle ను భారత నౌకాశ్రయాలపైన, యుధ నౌకలపైన దాడి చేయడానికి రంగంలొకి దింపాయి. చైనా కూడా తన నౌకా దళ్ళాన్ని భారత్ పై దాడి చేయడానికి రంగం సిద్దం చేసింది.
 
ఈ విషయం తెలుసుకున్న రష్యా వెంటనే ఈ సమాచారాన్ని భారత్ కు అందించింది. ఈ పరిస్తితులనుండి ఏలాగైనా గట్టెక్కించాలని భారత్, రష్యాని కొరడంతొ వెంటనే రష్యా తన ఫసిఫిక్ కమాండర్ వ్లాదిమిర్ క్రుగ్ల్యకొవ్ కు అమెరికా, బ్రిటన్, చైనాల నుండి భారత్ ను కాపాడే భాద్యతను అప్పగించింది..
 
వెంటనే వ్లాదిమిర్ క్రుగ్ల్యకొవ్ ముందుగా చైనా తీవ్ర హెచ్చరికలు జారీచేశారు “మీరు ఏటువంటి పరిస్తితులలొనైనా భారత్ పై దాడిచేస్తే వెంటనే మానుండి తీవ్ర స్థాయిలొ ప్రతిఘటన ఏదురౌతుంది, అందులొ ఏటువంటి సందేహం లేదు, ఈ విషయంలొ ఏమాత్రం రాజీ పడే ప్రశ్నేలేదు” అని హెచ్చరించడంతొ, భారత్ పై దాడి చేయాలనే తన అలొచనను చైనా విరమించుకుంది. ఇక ఈ కమాండర్ వెంటనే వ్లాడివొస్టొక్ నుండి రెండు యుధ నౌకలను, రెండు అణు జలాంతర్గాములను తీసుకుని స్వయంగా రంగంలొకి దిగారు.
 
ఇతను తెలివిగా USS_Enterprise వెంట ఒక యుధనౌక, ఒక జలాంతర్గామి, బ్రిటీష్ Eagle వెనుక ఒక యుధ నౌక, ఒక జలాంతర్గామితొ కేవలం 500 మీటర్ల దూరంలొ వెంబడించడం మొదలు పెట్టాడు, అంతెకాకుండా అమెరికా, బ్రిటన్ నేవీలను మీరు భారత్ పై ఒక్క మిస్సైల్ ఫైర్ చేసిన వెంటనే మేము మీపై దాడి చేస్తామని హెచ్చరిస్తూ వెంబడించాడు. ఐతే ఇతనిని తప్పించుకుని పొవాలని అమెరికన్, బ్రిటన్ నౌకలూ ఏంత ప్రయత్నం చేసినా పట్టు వదలని విక్రమార్కుడి లా అమెరికా, బ్రిటన్ యుధ నౌకలను దాదాపు 26 రొజుల పాటూ వెంబడిస్తూ భారతదేశంపై ఈగ వాలకుండా కాపాడారు.
 
ఈలొపు పాకిస్తాన్ పూర్తిగా ఓడిపొయి తన ఓటమిని అంగీకరించడంతొ, చేసేదేమీలేక అమెరికా, బ్రిటన్ నౌకలను వెనక్కు వెళ్ళిపొయాయి. ఆ యుధ నౌకలు వెళ్ళిన తరువాత కూడా మరలా తిరిగి వస్తాయొమొనని మరొక 20 రొజుల పాటు బంగళాఖాతం లొనే తిష్టవేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడారు.

One thought on “వ్లాదిమిర్ క్రుగ్ల్యకొవ్, 1971 యుధంలొ భారత్ ను కాపాడిన రష్యన్ కమాండర్

  • December 23, 2017 at 3:56 pm
    Permalink

    Great friend of bharat

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!