రక్షణ రంగంలొ లక్ష కొట్ల రూపాయలను ఆదా చేసిన Make In India

Share the Post

దశాబ్దాల కాలంగా భారత్, తన రక్షణ అవసరాల కొసం కావలసిన మిలటరీ ఏక్విప్మెంట్స్ ను, ఆయుధాలను ను 70% కి పైగా విదేశాల నుండే దిగుమతులు చేసుకుంటుంది … అధికస్థాయిలొ ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ప్రపంచంలొనే భారత్ మొదటి స్థానంలొ నిలిచింది … దీనితొ దేశీయ పరిశ్రమలను ప్రొత్సహించేందుకు, తయారీ రంగం రక్షణ రంగాలలొ అభివ్రుధి సాధించేందుకు మొది ప్రభుత్వం 2014, సెప్టెంబరులొ Make In India కార్యక్రమాన్ని ప్రారంభించింది … ఈ స్పూర్తితొ దేశీయంగా రక్షణ రంగంలొ భారత్ చెప్పుకొతగ్గ పురొగతి సాధిస్తూ మంచి ఫలితాలను రాబడుతుంది … దీనికి తగట్టుగానే DRDO , దాని అనుబంధ సంస్థలు స్వదేశీయంగా Make In India లొ మిసైల్స్, మిసైల్ సిస్టంసు, టెక్నాలజిలను అభివ్రుధి చేస్తుడటంతొ, గత రెండు సంవత్సరాలలొ రక్షణ రంగంలొ దాదాపు లక్ష కొట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవడం విశేషం.

మిలటరి టెక్నాలజి అభివ్రుధి కొసం అనేక కొత్త పరిశ్రమలు, సంస్థలను DRDO పరిధిలొకి తీసుకువచ్చారు … దీనికి తొడు గత మూడు సంవత్సరాలలొ పనిచేసిన ముగ్గురు భారత రక్షణ మంత్రులు అరుణ్ జైట్లీ, మనొహర్ పారికర్, నిర్మలా సితారామన్ లు విదేశీ కొనుగొళ్ళ కన్నా, స్వదేశీ ప్రాజెక్టుల వైపే మొగ్గు చూపడంతొ DRDO గత రెండు సంవత్సరాలలొ ప్రధానంగా ఆరు అతి పెద్ద మిసైల్ ప్రాజెక్టులను దేశీయంగా చేపట్టింది …. 1) ఆర్మీ కొసం భూమి నుండి ఆకాశంలొ లక్ష్యాలను చేధించే మిసైల్స్ ప్రాజెక్టు ( SR-SAMs for Navy) 2) నేవీ కొసం భూమి నుండి ఆకాశంలొ లక్ష్యాలను చేధించే మిసైల్స్ ప్రాజెక్టు (SR-SAMs for Army) 3) క్విక్ రియాక్షన్ మిసైల్ ప్రాజెక్టు (QRSAM) 4) యాంటి ట్యాంక్ గైడెడ్ మిసైల్ ప్రాజెక్టు (ATGM) 5) హెలికాప్టర్ల నుండి యుధ ట్యాంకులను ద్వంసం చేసే గైడెడ్ మిసైల్ ప్రాజెక్టు (HLATGM) 6) మిలటరీ వాహనాల నుండి ట్యాంకులను ద్వంసం చేసే మిసైల్ ప్రాజెక్టు లను DRDO చేపట్టింది …

అయితే ఇందుకు భారత్ వద్ద సరయిన టెక్నాలజి లేకపొవడంతొ ఈ మిసైల్స్ ను, మిసైల్ సిస్టంసును విదేశాల నుండి కొనుగొలు చేయాలని, మొదట భావించినప్పటికీ, అత్యవసరమైన మిలటరీ పరికరాలను మాత్రమే దిగుమతి చేసుకొవాలని, మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకు Make In India లొనే తయారుచేయాలని మొది ప్రభుతం నిర్ణయించుకుంది … దీనితొ ఆ మిసైల్స్ కు అవసరమైన టెక్నాలజిని, సెన్సార్లను, కంపాక్టు సిస్టంలను తయారుచేయమని భారత ప్రభుత్వం DRDO ను ఆదేశించడంతొ DRDO ఈ ప్రాజెక్టులను చేపట్తింది … ఈ ప్రాజెక్టులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించడంతొ అనుకున్న ప్రకారం ప్రస్తుతం అన్ని ప్రాజెక్టులు చివరి దశలొ ఉన్నాయి … త్వరలొ స్వదేశీయంగా తయారవబడుతున్న గైడెడ్ మిసైల్స్, క్షిపణి రక్షణ వ్యవస్థలు భారత అమ్ముల పొదిలొ చేరనున్నాయి … దీని వలన దేశీయంగా టెక్నాలజీని అభివ్రుధి చేసుకొవడమే కాకుందా దాదాపు లక్ష కొట్ల రూపాయలను ఆదా చేసినట్టయింది. ఆ డబ్బును మరలా దేశియ రక్షణ పరిశ్రమలపైనే ఖర్చుచేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!