Operation Arjun – పారిపొయిన పాకిస్థాన్ ఏజెంట్లు, కాళ్లబేరానికి వచ్చిన పాక్ రేంజర్లు

ఈ వ్యవహారాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తున్న భారత్, పాకిస్థాన్ నిష్కారణంగా ప్రతిసారి కాల్పులు జరుపుతున్నప్పటికీ, వాటికి తగిన రీతిలొ ఏదురు కాల్పులు జరిపి ఊరుకునేది. అయితే ఈ సంవత్సరం ఆగస్టు 25 వ తారీకున పాకిస్థాన్ జరిపిన కాల్పులలొ BSF కానిస్టేబుల్ K.K.అప్పారావు మరణించడంతొ ఇక బొర్డర్ సెక్యురిటీ ఫొర్స్ విజృంభించింది. భారత ప్రభుత్వం పూర్తి స్వచ్చనివ్వడంతొ “ఆపరేషన్ అర్జున్” ను ప్రారంభించింది. అసాల్ట్ రైఫిల్స్, కార్బైన్స్, ఇతర ఆయుధాలతొ పాటు కొండరాళ్లను, బంకర్లను బద్దలు కొట్టే long-range 81 mm weapons ను వాటితొ పాటు Aerial weapons ను కూడా ఉపయొగించి సరిహద్దు పొడవునా (మరీ ముఖ్యంగా అఖునూర్, జమ్ము, సాంబ సెక్టార్ల) వద్ద పాకిస్థాన్ రేంజర్లపై విరుచుకు పడ్డారు. పక్కా ప్యూహాత్మకంగా ఊహించని రీతిలొ, ఊహించని సమయంలొ, ఊహించని ప్రదేశాలలొ దాడులు జరుపుతూ పాకిస్థాన్ రేంజర్లకు చుక్కలు చూపించారు. మరీ ముక్యంగా రైతుల రూపంలొ గూఢచర్యం నిర్వహిస్తున్న మాజి ISI ఏజెంట్లు , మిలటరీ అధికారుల ఇళ్ళు, పొలాలపై గుళ్ళ వర్షం కురిపించారు.
దాదాపు నెల రొజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ (కాల్పులు)లొ పాకిస్థాన్ వైపు భారీ విద్వంసంతొ పాటు, పెద్ద ఏత్తున ప్రాణ నష్టం సంభవించాయి. అప్పటి వరకు రైతుల రూపంలొ గూఢచర్యం నిర్వహిస్తున్న ISI ఏజెంట్లు, అధికారులందరూ సరిహద్దుల నుండి పారిపొగా, పాకిస్థాన్ రేంజర్లు పూర్తిగా కాళ్ల బేరానికి వచ్చారు …. తప్పయిపొయింది, ఈ ఒక్కసారికి క్షమించండి అంటూ పాకిస్థాన్ డైరక్టర్ జనరల్ “అజర్ హయ్యత్ ఖాన్”, BSF డైరెక్టర్ “K.K శర్మ” కు పొన్ చేసి ప్రాధేయపడ్డాడు. దీనికి సంబందించి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే డిల్లీ అయినా వస్థామని కాళ్ళ బేరానికి వచ్చారు.
మొత్తంగా ఈ సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ అర్జున్, 2016 లొ నిర్వహించిన “అపరేషన్ రుస్తుం” తొ సమానంగా విజయవంతమవడం విశేషం
Nice information sir
Good