Good News – భారత్ కు మరొక ఉన్నత స్థానం కల్పించిన అమెరికా

Share the Post

గత కొద్ది కాలంగా అమెరికా_భారత్  సంబందాలు వేగంగా బలపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ ను తన Major  Defence Partner  గా గుర్తించిన అమెరికా, ఇప్పుడు భారత్ కు మరొక ఉన్నత స్థానం కల్పించింది. ఇక నుండి అమెరికా,  భారత్ ను “leading global power” గా గుర్తించనున్నట్టు అమెరికా విడుదల చేసిన కొత్త “నేషనల్ సెక్యురిటీ స్ట్రాటజి” (NSS) లొ పేర్కొంది. .

 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విడుదల చేసిన 62 పేజీల అమెరికన్ నేషనల్ సెక్యురిటీ స్ట్రాటజి లొ భారతదేశానికి అధిక ప్రాధాన్యత నివ్వనునట్టు పేర్కొంది. అంతేకాకుండా భారత్ తొ మరిన్ని ప్యూహాత్మక సంబందాలను మెరుగుపరచుకొనున్నట్టు తెలియజేసింది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా తెరపైకి తెచ్చిన #ఇండొ_ఫసిఫిక్ రీజియన్ లొ భారత్ తొ సహా జపాన్, ఆస్ట్రేలియా లతొ చతుర్బుజ సహకారాన్ని పెంపొందించుకొనున్నట్టు తెలియజేసింది.
 
ముఖ్యంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీరులొని భారత భూభాగం మీద నుండి చైనా నిర్మిస్తున్న OBOB, CPEC లను ద్రుష్టిలొ ఉంచుకుని, దక్షిణాసియా దేశాలకు మరే దేశం నుండి ఆపద వచ్చినా సహాయ, సహకారాలు అందించడానికి సిధంగా ఉన్నామని అమెరికా చెప్పడం విశేషం. అంతేకాకుండా తీవ్రవాదం విషయంలొ పాకిస్థాన్ పై ఇక నుండి మరింత తీవ్ర ఓత్తిడి తేనున్నట్టు, అయినప్పటికీ ఒకవేళ ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆశ్రయం కల్పించినట్టయితే పాకిస్థాన్ ను మరే దేశం కాపాడలేదని అమెరికా తెలియజేసింది.
 
మొత్తంగా అమెరికా విడుదల చేసిన కొత్త “నేషనల్ సెక్యురిటీ స్ట్రాటజి”  భారత్ కు పూర్తి అనుకూలంగా , చైనా_పాకిస్థాన్ లకు వ్యతిరేకంగా ఉండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!