సంచలన వ్యాఖ్యలు చేసిన సొము వీర్రాజు గారు

Share the Post
ఆంద్రప్రదేశ్ బిజెపి లొని కీలక నాయకుడైన సొము వీర్రాజు గారు మరొకసారి తనదైన శైలిలొ విరిచుకు పడ్డారు. గత కొంత కాలంగా ప్యుహాత్మక మౌనం పాటిస్తూ వస్త్తున్న సొము వీర్రాజు గారు నిన్న టిడిపి యం.యల్.సి బాబు రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
 
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ “బీజేపీ గుజరాత్‌లో వరుసగా ఐదోసారి అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రంలో గత ఎన్నికల్లో మేం(బీజేపీ), పవన్‌కల్యాణ్, చంద్రబాబు కలిస్తే రెండు శాతం మెజార్టీ మాత్రమే దక్కింది. ప్రస్తుతం రాష్ట్రంలో కమలం రేకులు విచ్చుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి మేం(బీజేపీ) హీరోలుగా మారతాం. ఏపీలో బీజేపీ బలపడుతుంది’’ అని సోము వీర్రాజు గారు స్రుష్టీకరించారు. తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మాన్ని ఉల్లంఘిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, బహిరంగంగా విమర్శించడం ఖాయమని సోము వీర్రాజు గారు తేల్చిచెప్పారు.
 
రాస్ట్రంలొ పరిపాలన చేయకుండా, వ్యాపారం చేస్తుంది ఏవరొ అందరికీ తెలుసని, అంత్యోదయం కోసం శ్రమించే పార్టీ బీజేపీ అని, టిడిపి వాళ్ళు వైసిపి వాళ్లను జాయిన్ చేసుకునే పనిలొ ఉన్నారు, అవినీతి పరులుగా ముద్రపడ్డవారికి మంత్రిపదవులిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1999, 2014 లొ కేవలం బిజెపితొ పొత్తు కారణంగానే టిడిపి అధికారంలొకి వచ్చిందని హితవు పలికారు. 2004 మీమాటలు విని ముందస్తు ఏన్నికలకు పొయినందుకు మాంకు తగిన శాస్తి జరిగిందని తెలియజేశారు.
 
2019 ఎన్నికల నాటికి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడాలనే లక్ష్యంతో ఉందని, ఏపీలోనూ ఆ దిశగా కృషి చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు, మిత్ర ధర్మం విస్మరించి బీజేపీపై విమర్శలు చేసినప్పుడు కచ్చితంగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!