భగవద్గీతలొని అర్జునుడు నాకు ఆదర్శం – సంచలన ప్రకటన చేసిన హాలివుడ్ సూపర్ స్టార్ “Will Smith”

Share the Post

ప్రస్తుతం భారత పర్యటనలొ ఉన్న ప్రముఖ హాలివుడ్ నటుడు “విల్ స్మిత్”  భగవద్గీత గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరొక మూడు రొజులలొ విడుదల కానున్న తన సినిమా ” Bright” ప్రమొషన్ కొసం భారత్ వచ్చిన విల్ స్మిత్, భగవద్గీత_భారతదేశం గురించి తన మనసులొ మాట చెప్పారు.

ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ,  తనకు భగవద్గీత అంటే చాలా గౌరవమని, భగవద్గీత అనేది ఒక్క అధ్యాత్మిక స్పూర్తి మాత్రమే కాదని, మన రొజు వారి జీనవ విధానాన్ని తెలియజేసే గొప్ప గ్రంధమని, భగవద్గీతను ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా ప్రపంచమంతా గొప్పగా ప్రశంసించిందని విల్ స్మిత్ తెలియజేశారు. అంతేకాకుండా భగవద్గీతను తాను దాదాపు 90% చదివానని , , అందులొని అర్జునుడు తనకు ఆదర్శప్రాయుడని తెలియజేయడం విశేషం.

అందుకే భారతదేశమన్నా,  ఇక్కడి భొజనమన్నా తనకు చాలా ఇష్టమని, హిందువుల పవిత్ర క్షేత్రమైన #హృషికేష్ పుణ్యక్షేత్రంలొ కొన్ని రొజులు గడిపి వెళతానని తెలియజేశారు.  ఇండియా వచ్చిన విల్ స్మిత్  తన మిత్రుడు, బాలివుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ను  కలిశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!