Breaking News : భారత రహస్యాలు తెలుసుకొవడానికి మరొకసారి Honeytrap విసిరిన పాకిస్థాన్

Share the Post
మరొకసారి పాకిస్థాన్ తన సహజ బుద్ధి చూపించింది. తనకు బాగా కలిసివచ్చిన Honeytrap ను మరొకసారి భారత అధికారులపై ప్రయొగించింది. ఇప్పటివరకు భారత రహస్యాలు తెలుసుకొవడానికి చిన్న చిన్న అధికారులను లక్ష్యంగా చేసుకున్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI , ఈసారి ఏకంగా పాకిస్థాన్ లొని భారత రాయబార కార్యాలయంలొ పనిచేసే దౌత్యాధికారులను టార్గెట్ చేసింది.
 
కీలకమైన స్థానాలలొ ఉన్న వ్యక్తులకు అందమైన అమ్మాయిలను ఏరగా వేసి, దానిని చిత్రీకరించి, తద్వారా వారిని బెదిరించి, వారి ద్వారా రహస్యాలు సంపాదించడమే “హని ట్రాప్”. సహజంగా “హని ట్రాప్” అనేది ప్రపంచంలొని అన్ని దేశాలలొ జరిగే విషయమే. అయితే ఇందులొ మాస్టర్ డిగ్రీ పొందిన పాకిస్థాన్ దీనిని ఒక అలవాటుగా మార్చుకుంది.
 
ఇస్లామాబాద్ లొని భారత రాయాబార కార్యాలయంలొ Language section లొ కీలకమైన Documents ను వివిధ భాషలలొకి Translate (అనువాదం) చేసే ముగ్గురు అధికారులపై పాకిస్థాన్ Honeytrap విసిరింది. ఇస్లామాబాద్ లొ ఉన్న హొట్లల్స్ లొ అందమైన అమ్మాయిల ద్వారా అనేక సార్లు ఈ అధికారులపై Honeytrap ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అనుమానం వచ్చిన ఈ అధికారులు, తమను కాపాడమని పై అధికారులకు మొరపెట్టుకొవడంతొ, వెంటనే రంగంలొకి దిగిన భారత గూఢచార సంస్థ RAW , వీరిని రహస్యంగా భారత్ రప్పించి, ఈ కేసుపై విచారణ చేపట్టింది
 
అయితే అద్రుష్టవశాత్తూ భారత్ కు సంబందించిన ఏటువంటి సమాచారం Leak అవ్వలేదని అధికార వర్గాలు తెలియజేశాయి. ఇది నేషనల్ సెక్యురిటి కి సంబందించిన విషయం కావడం, ఈ కేసు విచారణలొ ఉండటంతొ ఆ అధికారుల పేర్లను రహస్యంగా ఉంచారు. మరలా వీరిని పాకిస్థాన్ పంపే అవకాశం లేనట్టు తెలుస్తుంది. త్వరలొ ఈ విషయం పై భారత ప్రభుత్వం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్తు తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!