సార్వభౌమ క్రెడిట్ రేటింగ్ పెరగటం వలన కలిగే ప్రయోజనం ఏంటి?

Share the Post

రేటింగ్‌  పెరగడం వలన కలిగే ప్రయోజనాలు

  • మన దేశం విదేశి బ్యాంకుల నుండి తెచ్చిన అప్పులకు ఇప్పుడు తక్కువ వడ్డీ  పడుతుంది.
  • మనం విదేశి భ్యాంకులు నుండి మరింత అప్పులు సులువుగా తెచ్చుకోవచ్చు.
  • దీని వలన దేశంలో పెట్టుబడులుపై సానుకూలత నెలకుంటుంది.
  • పెట్టుబడులతో  మరింత ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి
  • మేక్ ఇన్ ఇండియా కల సాకారం అవుతుంది.మేక్ ఇన్ ఇండియా నినాదం ఊపందుకుంటుంది.
  • వడ్డీ రేటు తగ్గుదలతో ఆర్దికలోటు క్రమేణ తగ్గుముఖం పడుతుంది.
అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ భారత సార్వభౌమ క్రెడిట్‌ రేటింగ్‌ను 13ఏళ్ల తర్వాత బీఏఏ3 నుంచి బీఏఏ2 స్థాయికి పెంచింది. అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా 13ఏళ్ల క్రితం మూడీస్‌ భారత్‌కు బీఏఏ3 రేటింగ్‌ ఇచ్చింది. ఇప్పుడు ప్రధాని మోదీ పాలనలో ఆ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల ప్రతిఫలమే రేటింగ్‌ మెరుగుపడటానికి కారణమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాని మోదీ విశేషమైన కృషి, సంస్కరణల కారణంగానే మూడీస్‌ క్రెడిట్‌ రేటింగ్‌ పెరిగింది. వ్యాపారానికి అనుకూలమైన దేశాల్లో భారత్‌ ర్యాంకు మెరుగుపడటం, ప్యూ సర్వేలో మోదీకి భారీగా ప్రజాదరణ ఉందని తేలడం కూడా ఆయన కృషి ఫలితమే’.- భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో చేపడుతున్న సంస్కరణల కారణంగా భారత్‌ మరింత అభివృద్ధి చెందుతోందని గుర్తించారు. 2004 తర్వాత భారత సార్వభౌమ రేటింగ్‌ను మూడీస్‌ అప్‌గ్రేడ్‌ చేసింది. ప్రపంచమంతా సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ను గుర్తిస్తోంది.’.- కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌
స్వాగతించదగిన అభివృద్ధి ఇది. కానీ ఇది చాలా కాలం తర్వాత వచ్చింది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వంటి చారిత్రక నిర్ణయాలను తీసుకుంటున్న ప్రభుత్వానికి ఇదొక గుర్తింపు’.- చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌
ప్రభుత్వం దీర్ఘకాలిక సంస్కరణలు, ఆర్థిక స్థిరీకరణ దిశగా తీసుకుంటున్న నిర్ణయాలను పెట్టుబడిదారులు ఇప్పటికే గుర్తించారు. ఇప్పుడు మూడీస్‌ రేటింగ్‌ ఏజెన్సీ అధికారికంగా గుర్తించింది. దీన్ని స్వాగతిస్తున్నాం’.- ఆర్థిక సెక్రటరీ హస్‌ముఖ్‌ అథియా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!