మరొక ఘనత సాధించిన భారత్, లెగటుం ప్రాస్పెరిటీ ఇండెక్స్ లొ మొదటిసారి Top 100 లొ స్థానం సంపాదించిన భారత్

Share the Post
గత కొంత కాలంగా ప్రవేశపెట్టిన నొట్ల రద్దు, GST వంటి అర్ధిక సంస్కరణల కారణంగా భారత్ మరొక ఘనత సాధించింది. ఇప్పటికే Easy of doing business లొ మొదటిసారి Top 100 లొ స్థానం సంపాదించిన భారత, ఇప్పుడు Legatum Prosperity Index లొ మొదటిసారి Top 100 లొ స్థానం సంపాదించి, 100 వ స్థానంలొ నిలిచింది. 2016 లొ 104 వ స్థానంలొ ఉన్న భారత్ ఇప్పుడు మరొక నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని మొదటిసారి 100 వ స్థానానికి చేరుకుంది. BRICS దేశాలలొ ఈ ఇండెక్స్ లొ స్థానాలు మెరుగుపరచుకున్న ఏకైక దేశం భారత్ మాత్రమే కావడం విశేషం. 
 
లండన్ లొని సుప్రసిద్ద లెగటుం ఇనిస్టిట్యుట్ ఇచ్చే ఈ ర్యాంకులలొ మొత్తంగా తొమ్మిది విభాగాలలొ జరిగే అభివ్రుధిని చూసి ఈ ర్యాంకులు ఇస్థారు. ఆర్ధిక పరిస్తితి (స్థిరత్వం) లొ 54 వ స్థానం సంపాదించిన భారత్, వ్యాపారానికి అనుకూలంగా ఉండే దేశాల జాబితాలొ భారత్ 21 స్థానాలను మెరుగుపరచుకుని 65 వ స్థానానికి చేరడం విశేషం. వ్యాపార అనుకూల వాతావరణం గల దేశాల జాబితాలొ అత్యధిక స్థానాలు మొరుగు పరచుకున్న రెండవ దేశం భారత్ కావడం విశేషం. కాగా పరిపాలన విషయంలొ అత్యధికంగా 41 వ స్థానంలొ ఉన్న భారత్, Social Captial లొ 82 వ స్థానం సంపాదించింది. అయితే సహజ వనరులు, ఆరొగ్యం, విద్యా రంగాలలొ భారత్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని ఈ సంస్థ పేర్కొంది.
 
2016 నుండి చైనా, భారత్ ల మద్య వ్యత్యాసం తగ్గుతున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ఈసారి కూడా చైనా 90 వ స్థానంలొనే ఉండగా, భారత్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకుని మొదటిసారి 100 వ ర్యాంకును సాధించింది. కాగా ఈ ర్యాంకుల వలన భారత్ కు గౌరవ మర్యాదలు పెగడమే కాకుండా, పెద్ద ఏత్తున పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!