చైనా ఆధిపత్యానికి గండికొట్టి, హిందూ మహా సముద్రంపై పట్టుబిగిస్తున్న భారత్

Share the Post

గత దశాబ్దకాలంగా హిందూమహా సముద్రం పై పట్టుబిగిస్తున్న చైనా ఆధిపత్యానికి గండికొట్టి, హిందు మహా సముద్రంపై పూర్తిస్థాయిలొ పట్టుబిగించేందుకు భారత ప్రభుత్వం రంగంలొకి దిగింది … గత కొంత కాలంగా చైనీస్ సబ్మెరైన్లు, యుధ నౌకలు హిందూమహా సముద్రంలొనే కాకుండా, భారత ప్రాదేశిక జల్లాలొకి కూడా రహస్యంగా ప్రవేశిస్తుండటంతొ దీనికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడమే కాకుండా మొత్తం హిందూమహా సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి మొది ప్రభుత్వం కొత్త మిషన్ ను ప్రారంభించింది … ఇందులొ భాగంగా పర్షియన్ గల్ఫ్ నుండి మలక్కా స్ట్రైట్ వరకు, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుండి సుందా స్ట్రైట్ వరకు పూర్తి స్థాయిలొ ఆధిపత్యం సాధించేందుకు భారత ప్రభుత్వం 15 అత్యాధునికమైన డిస్ట్రాయర్స్ ను, ఫ్రిగేట్స్ ను, యుధ నౌకలను రంగంలొకి దింపింది … వీటికి తొడు ఈ ప్రాంతాలలొ సంవత్సరం పొడవునా, 24 గంటలు గస్తీ నిర్వహించేందుకు అతి పెద్ద గస్తీ నౌకలను రంగంలొకి దింప్పారు

వీటిని పక్కా ప్లాన్ ప్రకారం హిందూమహా సముద్రంలొ మొహరిస్తున్నారు … అది ఎలాగంటే “శివాలిక్ క్లాస్” యుధ నౌక బంగ్లాదేశ్, మయన్మార్ వైపు గస్తీ నిర్వహిస్తున్నప్పుడు, అదే సమయంలొ “టెగ్ క్లాస్” కు చెందిన యుధ నౌక మారిషస్, సెషెల్స్ వైపు విధులు నిర్వహిస్తుంది … అలాగే INS త్రిశూల్, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ లొ పహారా కాస్తున్నప్పుడు, “కొరా క్లాస్” సాంప్రదాయ యుధ నౌక అండమాన్ సముద్రంలొ గస్తీ నిర్వహిస్తుంది … వీటికి తొడు ఏటువంటి సబ్మెరైన్లనయినా గుర్తించి, వెంటాడి, వేటాడి ద్వంసం చేసే అమెరికా నుండి కొనుగొలు చేసిన “పొసిడాన్-8I” యుధ విమానాలు ప్రతిరొజూ ఆకస్మికంగా హిందూమహా సముద్రంలొ గస్తీ నిర్వహిస్థాయి … వీటన్నింటినీ ఏప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, హిందూ మహా సముద్రంలొ అణువణువునూ జల్లెడపట్టి, ఏప్పటికప్పుడు సమాచారాన్ని నౌకా దళాలకు అందించే #రుక్మిణి_శాటిలైట్ ను సముద్ర జలాల పర్యవేక్షణకు ఉపయొగిస్తున్నారు … రుక్మిణి శాటిలైట్ అనేది Multi-band military communications satellite … భారతీయ రక్షణ దళాలకు, ముఖ్యంగా నావికాదళానికి అవసరమైన సాంకేతిక సమాచారాన్ని అందించుటకై ఇస్రో సంస్థ వారు రూపొందించిన మొదటి ఉపగ్రహమే ఈ రుక్మిణీ ఉపగ్రహం … హిందూ మహా సముద్రంలొ దాదాపు 3,800 కిలొమీటర్ల సముద్ర ప్రాంతాన్ని పర్యవేక్షించగల సత్తా రుక్మిణి సొంతం …
ఇది మాత్రమే కాకుండా ఇండియన్ నేవి ను చైనీస్ నేవి కి ధీటుగా బలొపేతం చేసేందుకు, ఇండియన్ నేవి వద్ద నున్న 138 యుధ నౌకల సంఖ్యను 212 కు పెంచేందుకు, ఇండియన్ నేవీ కలిగి ఉన్న 235 యుధ విమానాలు, హెలికాప్టర్ల సంఖ్యను 460 కు పెంచేందుకు భారత ప్రభుత్వం శరవేగంగా Make In India లొనే వీటి నిర్మాణాలు చేపడుతుండటం విశేషం.

 

Tarun Teja Patchipulusu
Tarun Teja Patchipulusu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!