ఇస్లామిక్ KingDom “సౌది అరేబియా” ను మార్చివేసిన యోగా టీచర్

Share the Post
సౌది అరేబియా, ముస్లిం లకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనా పుణ్యక్షేత్రాలు ఇక్కడే ఉన్నాయి. సున్నీ దేశమైన సౌది అరేబియాలొ ఆచార వ్యవహారాలు, ఆంక్షలు అత్యంత ఖటినంగా ఉంటాయి. ఆర్ధికంగా, రాజకీయంగా అత్యున్నత స్థానంలొ ఉండటం, దానికి తొడు అమెరికా అండదండలు ఉండటంతొ ఇస్లామిక్ ప్రపంచంలొ సౌది అరేబియా తిరుగులేని శక్తిగా వెలుగొందుతుంది. మత విశ్వాసాలకు పెట్టింది పేరైన సౌది అరేబియాలొ, హిందూ మతానికి సంబందించినదిగా ముద్రపడ్ద యొగా ను అధికారికంగా తమ దేశంలొకి ఆహ్వానించడమంటే అసలు ఊహ కందని విషయం.
 
కాని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది ప్రఖ్యాత యోగా టీచర్ “నౌఫ్ మార్వాయ్”. సౌది అరేబియా దేశస్తురాలైన నౌఫ్ మార్వాయ్, చిన్నప్పటి నుండి “Auto immune disease” తొ భాదపడుతూ ఉండేది. దీని వలన అందరిలా సాధారణ జీవితం గడపలేని నౌఫ్ మార్వాయ్, వైద్యం కొసం ఆస్టేలియా వెళ్ళింది. అయినప్పటికీ రొగమ నయం కాకపొవడంతొ ఒక ఆస్టేలియా డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు యొగా నేర్చుకొవడానికి కేరళ వచ్చింది. కేరళ లొని ప్రాచీన ఆయుర్వేద చికిత్సాలయంలొ చేరింది. అప్పటి నుండి మెల్ల మెల్లగా ఆమె ఆరొగ్యం మెరుగుపడుతుండటంతొ, మరింతగా యొగా మెళకువలు నేర్చుకొవడానికి డిల్లీ, హిమాలయాలకు వెళ్ళి వచ్చింది. దీనితొ ఆమె ఆరొగ్యం బాగుపడటంతొ, ఇక యొగా ను ఏలగైనా సౌది ఆరేబియాకు కూడా పరిచయం చేయాలని భావించింది.
 
2009 లొ స్వామి విధ్యానంద గారితొ కలిసి, నౌఫ్ మార్వాయ్ సౌది అరేబియాలొ యొగా అంతర్జాతీయ స్కూను ప్రారంభించింది. అయితే మత విశ్వాలను ఖచితంగా పాటించే సౌది లొ యొగాను పరిచయం చేయడమంటే మాటలు కాదు. ఏమాత్రం తేడా వచ్చినా ఉరిశిక్ష తప్పదు. దీనితొ నౌఫ్ మార్వాయ్ ఈ విషయంలొ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. యొగాకు, మతానికి సంబందం లేదని మీడియా ద్వారా, సొషల్ మీడియా ద్వారా పెద్ద ఏత్తున ప్రచారం చేశారు. సౌది అంతటా యొగాను పరిచయం చేయడానికి ఆమె ముందుగా మహిళలను ఏంచుకున్నారు. వారికి సంబందించిన ఇబ్బందులు, కష్టాలు, మనసిక,శారీరక సమస్యల నుండి బయటపడటానికి యొగా ఏలా ఉపయొగ పడుతుందొ మీడియా ద్వారా విస్త్రుతంగా ప్రచారం చేసింది. దీనితొ సౌది ప్రజలకు యొగా పట్ల సదభిప్రాయం కలిగించగలిగింది.
 
దీనికితొడు మొది గారి చలవతొ ఐక్యరాజ్య సమితి 2015 నుండి జూన్ 21 ని అంతర్జాతీయ యొగా డే గా ప్రకటించడంతొ, సౌది అరేబియాలొ కూడా యొగా గురించి, పెద్ద ఏత్తున ప్రచారం జరిగింది. దీనితొ సౌది అరేబియా లొని ముక్య నగరాలైన మక్కా, రియాద్, జెడ్దా, మదీనా లలొ నౌఫ్ మార్వాయ్, భారతీయ సంస్థలతొ కలిసి పెద్ద ఏత్తున యొగా క్లాసులు ప్రారంభించింది. దీనితొ యొగా పై సౌది ప్రజలకు అవగాహన, గౌరవాన్ని కలిగించడంలొ నౌఫ్ మార్వాయ్ సఫలీక్రుతమైంది. చివరిగా సౌది అరేబియా యువరాజు, ఇతర అధికారులతొ చర్చలు జరిపి యొగాను సౌది అరేబియాలొ అధికారికంగా ప్రవేశపెట్టించడంలొ విజయం సాధించింది. నౌరు మార్వాయ్ క్రుషి వలన ఇక నుండి సౌది అరేబియాలొ లైసెన్స్ తీసుకుని ఏటువంటి ఆటంకం లేకుండా యొగా స్కూల్సును, యొగా ప్రచారం చేసుకొవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!