1962 చైనా యుద్ధంలో ఓటమికి సంబందించిన రహస్యాలు బయట పెట్టిన పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీంద్ర సింగ్

Share the Post

1962 చైనా యుద్ధంలో ఓటమికి సంబందించిన రహస్యాలు బయట పెట్టిన పంజాబ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అమరీంద్ర సింగ్ 1962 లొ చైనా తొ జరిగిన యుధంలొ భారత్ ఘొర పరాజయం పొంది, పరాభావాన్ని మూట గట్టుకోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఓటమికి గల కారణాలకు సంబందించిన అనేక వార్తలు షికార్లు చేశాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టికి చెందిన పంజాబ్ ముఖ్యమంత్రి, ఒకప్పటి ఇండియన్ ఆర్మీలొ కెప్టెన్ గా పనిచేసిన కెప్టెన్ అమరేంద్ర సింగ్ ఇప్పుడు ఆ రహస్యాలను నిర్మొహమాటంగా బట్టబయలు చేశారు. 1962 చైనాతొ యుధంలొ ఓటమికి అప్పటి డిల్లీ ప్రభుత్వం చేతగాని తనమే కారణమని కుండబద్దలు కొట్టారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ “చైనా నుండి ఏన్ని రకాల బెదిరింపులు వస్తున్నప్పటికీ అప్పటి డిల్లీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చుంది. చైనా యుధ సనాహాలు చేస్తుందని స్పష్టమైన సమాచారం వచ్చినప్పటికీ కనీసం సైన్యాన్ని సమాయత్తం చేసే ప్రయత్నం కూడా చేయలేదు. దీనితొ భారత సైన్యం కనీసం ఆయుధాలు, మందుగుండు కూడా లేకుండా యుధంలొకి దిగాల్సి వచ్చింది. యుధంలొ ఓటమికి అప్పటి కేంద్ర ప్రభుత్వ విధానాలతొ పాటు, నిఘా వైఫల్యాలు కూడా కారణమయ్యాయి. అప్పటి డిల్లీ పెద్దలు అన్ని ముఖ్యమైన పదవులలొ తమ వందిమాగదులనే నియమించారు. చివరికి సైనిక కమాండర్లను కూడా సమర్ధులను కాకుండా, తమ భజన చేసే వారినే నియమించారు. దీనితొ యుధ సమ్యంలొ వీరు సరయిన నిర్ణయాలు తీసుకొలేక పొయారు. చివరికి యుధంలొ పాల్గొన్న సైనికులకు చలిని తట్టుకునే దుస్తులతొ పాటు కనిసం ఆహారాన్ని కూడా అందించలేక పొయారు. దీనితొ తీవ్ర ఇబ్బందులను ఏదుర్కొన్న భారత సైనికులు కొన్ని సమయాలలొ నీరు, ఉప్పు పై ఆధారపడి మనుగడసాగించారు” అని అమరీంద్ర సింగ్ అప్పటి ఓటమికి గల కారణాలను స్పష్టంగా వివరించారు. అసలు అంతకనా ఘొరమైన విషయమేమిటంటే ఉపఖండంలొ భారత్ తనకు ప్రధాన ప్రత్యర్ధిగా భావించిన చైనా, 1950 నుండే భారత భూభాగాలపై కన్నేసింది. ఇందుకొసం జమ్మూ కశ్మీర్‌లో భాగమైన అక్సాయ్‌చిన్‌లో 38వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించి, భారత్ కు తెలియకుండా ఝింజియాంగ్‌-టిబెట్‌ల మధ్య సైన్యాన్ని తరలించడానికి ఏకంగా హైవేనే నిర్మించేసింది. 1957లో చైనా అధికారికంగా ప్రకటించే వరకు ఈ హైవే నిర్మాణ పనుల్ని భారత ప్రభుత్వం గుర్తించలేకపొయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!