17 సంవత్సరాల సుధీర్గ విరామం తరువాత భారత అమ్ముల పొదిలొ చేరిన జలాంతర్గామి INS కల్వరి

Share the Post

ఇండియన్ నేవి కల నెరవేరింది. దాదాపు 17 సంవత్సరాల నిరీక్షణ తరువాత స్కార్పియన్ సబ్మెరైన్ #INS_కల్వరి ఇండియన్ నేవిలొకి ప్రవేశించింది. నిన్న భారత ప్రధాని నరేంద్రమొది గారు అధికారికంగా ఈ జలాంతర్గామిని జాతికి అంకితం చేశారు. 2000 సంవత్సరంలొ ఇండియన్ నేవిలొ చేరిన “INS సింధురాస్ట్ర” తరువాత నేవిలొ చేరిన మొదటి సబ్మెరైన్ కల్వరి మాత్రమే …. ప్రాన్స్ సహకారంతొ దీనిని స్వదేశీయంగా ముంబాయి మజగావ్ డాక్ యార్డ్ లొ నిర్మించారు.

ఇది Attack submarine…. 1.566 టన్నుల బరువుతొ, 67.5 మీటర్ల పొడవుతొ అత్యంత శక్తివంతమైన ఈ డీజిల్‌-ఎలక్ట్రికల్‌ సబ్మెరైన్, టైగర్ షార్క్ తరహాలొ Deep sea predator గా అత్యంత సమర్ధవంతంగా పనిచేయగలదు. 750 కిలొల బరువులగల మొత్తం 360 బేటరీల శక్తితొ, నీటి ఉపరితలానికి 1,150 అడుగుల దిగువున నిశబ్ధంగా ప్రయాణిస్తూ, శత్రువును తెలియకుండా దాడిచేయగల సత్తా దీని సొంతం. ప్రధానంగా దీని ద్వారా హిందూ మహా సముద్రంలొ స్వేచ్చగా విహరిస్తున్న చైనీస్ సబ్మెరైన్లకు చెక్ పెట్టవచ్చు.

ప్రాజెక్టు-75 క్రింద భారత్ నిర్మిస్తున్న మొత్తం ఆరు స్కార్పియన్ సబ్మెరైన్లలొ “INS కల్వరి” మొదటిది. కాగా ఈ వరుసలొ రెండవదైన “INS కంధేరి” నిర్మాణం పూర్తి చేసుకుని ప్రస్తుతం లొ ఉంది. మొత్తంగా 2021 కల్లా ఈ ఆరు స్కార్పియన్ జలాంతర్గాములు ఇండియన్ నేవి కి అందుబాటులొకి రానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!