సిల్క్ రోడ్డుకు ధీటుగా చైనాకు భారీ షాక్ ఇవ్వనున్న భారత్, రష్యాలు

Share the Post

చైనా తలపెట్టిన Silk Road కు పొటిగా భారత్, రష్యా దేశాలు మరొక గొప్ప రవాణా వ్యవస్థను (Transport Corridor) ను రూపొందించాయి … అదే International North–South Transport Corridor (INSTC) … వచ్చే నెల #జనవరి లొనే ఈ కారిడార్ ను ప్రారంభించనున్నారు … 7,200 కిలొమీటర్ల పొడవైన ఈ Corridor సముద్రం, రైలు, రొడ్డు మార్గాల ద్వారా వెళ్లే బాహుళ రవాణా వ్యవస్థ … దీని ద్వారా తెలికగా మధ్య ఆసియా, సెయింట్ పీటర్స్ బర్గ్, మాస్కొ, ఉత్తర యురొపియన్ దేశాలు, యురేషియా దేశాలకు మన ఏగుమతులను, దిగుమతులను తేలికగా, చౌకగా రవాణా చేయవచ్చు … 2002 లొ అప్పటి ప్రధాని వాజపాయ్ గారు ముందుచూపుతొ ఈ Transport Corridor కు సంబందించి రష్యా, ఇరాన్ దేశాలతొ ఓప్పందం చేసుకున్నారు … అయితే UPA హయాంలొ మూల పడ్ద ఈ మెగా ప్రాజెక్టు మరల మొది ప్రభుత్వం రాగానే పట్టాల కెక్కింది … వచ్చే నెలలొనే రవాణా వ్యవస్థను #ముంబాయి నుండి ప్రారంభించనున్నారు. ఈ కారిడార్ వలన మనకు పెద్ద ఏత్తున సమయం, డబ్బు ఆదా కానుంది …. ఇప్పటి వరకు మనం ఉపయొగిస్తున్న రవణా మార్గం వలన యురొపియన్ దేశాలు, పశ్చిమ రష్యా, యురేసియన్ దేశాలకు సరుకులు చేరడానికి దాదాపు 45 – 60 రొజులు పట్టేది. అయితే ఈ రవాణా వ్యవస్థ వలన కేవలం 25 – 30 రొజులలొనే సరుకు రవాణా చేయవచ్చు … అంతేకాకుండా దీని ద్వారా దాదాపు 40% డబ్బు ఆదా అవనుంది … ప్రతి 15 టన్నుల సరుకు రవాణా కు 2,500 డాలర్ల డబ్బు ఆదా అవనుండటం విశేషం … వచ్చే నెల జనవరిలొ ఈ రవణా మార్గాన్ని ప్రారంభించనున్నారు … ఈ మొత్తం రవాణా వ్యవస్థలొ మన ముంబాయి కీలక పాత్ర పొషించనుంది. ఈ కారిడార్ లొ భాగంగా ముందుగా సరుకులు ముంబాయి నుండి చబహార్ పొర్టు, బందర్ అబ్బాస్ పొర్టు లకు చేరతాయి … మరలా అక్కడి నుండి రొడ్డు లేదా రైలు మార్గాల ద్వారా మద్య ఆసియా దేశాలకు సరుకు రవాణా అవుతుంది … అక్కడి నుండి మరలా కాస్పియన్ సముద్ర మార్గం ద్వారా, లేదా రైలు మార్గం ద్వారా పశ్చిమ రష్యా (మాస్కొ, సెయింట్ పీటర్స్ బర్గ్), ఉత్తర యురప్ దేశాలకు, యురేషియన్ దేశాలకు సరుకు రవాణా అవుతుంది … దీని వలన భారత్_రష్యా దేశాల మద్య ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్ల కు పెరగడమే కాకుండా ఆయా దేశాలతొ పెద్ద ఏత్తున వ్యాపార వాణిజ్యాలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!