రామసేతు నిర్మించింది శ్రీరాముడే. ఆధారాలతొ సహా నిరూపించిన అమెరికన్ సైన్స్ చానల్

Share the Post

రామసేతు నిర్మించింది శ్రీరాముడే. ఆధారాలతొ సహా నిరూపించిన అమెరికన్ సైన్స్ చానల్ రామ సేతు, దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో భాగమైన రామేశ్వరం ద్వీపానికి, మరియు శ్రీలంక దేశానికి చెందిన మన్నర్ ద్వీపానికి మధ్య శ్రీరాముడు నిర్మించిన వారధే ఈ రామసేతు. రామసేతు అనేది హిందూ మహా గ్రంధమైన రామాయణంలొని కీలకమైన అంశం. శ్రీరాముని అర్ధాంగి అయిన సీతమ్మవారిని లంకాధీశుడైన రావణుడు అపహరించి, లంకంలొని అశొకవనంలొ బందించాడు. దీనితొ సీతమ్మవారిని రావణుడి చెర నుండి విడిపించడానికి శ్రీరాములవారు, సుగ్రీవుని సైన్యంతొ లంకకు చేరుకొవడానికి రామేశ్వరం ద్వీపం నుండి లంకకు సముద్రం మీదగా వారదిని నిర్మించారు. ఈ వారధినే రామసేతు అని అంటారు అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన సైన్స్ చానల్ అనేక పరిశొధనలు జరిపి రామసేతు సహజ సిధంగా ఏర్పడిన వారధి కాదని, మానవులచే నిర్మితమైన బ్రిడ్జి అని తేల్చి చెప్పింది. ఇందుకొసం నాసా శాటిలైట్లను ఉపయొగించి, పరిశొధించిన సైన్స్ చానల్, ఈ వారధి 7000 సంవత్సరాల క్రితమే ఇసుక దిబ్బలపై సున్నపురాళ్లతొ దీనిని నిర్మించారని పక్కా ఆధారాలతొ డిస్కవరీకి చెందిన ఈ చానల్ నిరూపించింది. 30 మైళ్ళ పొడవునా నిర్మించబడిన ఈ వారధిని సామాన్య మానవులు నిర్మించలేరని ప్రముఖ అమెరికన్ పురాతత్వ శాస్త్రవేత్త చెల్సియా రొజ్ తెలియజేశారు. దీనికి సంబందించిన విడియొ ను కూడా ఈ చానల్ విడుదల చేసింది. కాగా ఈ బ్రిడ్జి సరిగ్గా రామాయణ గ్రంధంలొ పేర్కొన్న ప్రాంతంలొనే రాళ్లాను కనుగొన్నట్టు పరిశొధకులు తెలియజేశారు. అయితే ఇనాళ్ళు ఇది ఒక కల్పితగాధ అని, రామసేతు అనేది మానవ నిర్మితం కాదని, సహజ సిధంగా ఏర్పడిన బ్రిడ్జి అని కొన్ని సంస్థలు, కొన్ని పార్టీలు పని గట్టుకుని ప్రచారం చేశాయి. అప్పటిలొ అంత టెక్నాలజి ఏక్కడ ఉందని, రాముడు ఏ కాలేజిలొ చదువుకున్నాడని హేళన చేశారు. చివరికి ఈ రాసేతు వారధిని లేకుండా చేయడానికి సేతుసముద్రం అనే ప్రాజెక్టును తెర మీదకు తీసుకు వచ్చారు. రామసేతు నిజం కాదని గతంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసింది. అయితే ఆర్.యస్.యస్, భజరంగదల్, విశ్వహిందు పరిషత్ లాంటి హిందూ సంస్ఠలతొ పాటు, బిజెపి కూడా ఈ సేతుసముద్రం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించడంతొ ఈ ప్రాజెక్టు వాయిదా పడింది. ఇప్పుడు డిస్కవరీకి చెందిన సైన్స్ చానల్ ఆధారాలతొ సహా నిరూపించడంతొ, ఇప్పటి వరకు రామసేతు ను వ్యతిరేకించిన వారి గొంతులొ పచ్చి వెలక్కయ పడ్డట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!