మోదీ గారి దెబ్బకు బెదిరిపోయి, లంచం వెనక్కు ఇచ్చేసిన పొలీస్ అధికారి

Share the Post

బహుశా ఇలాంటి వార్తలు మీరు మీడియా లొ చూసి ఉండరు … గత మూడు సంవత్సరాలుగా ఇలా జరిగిన ఏన్నొ సంఘటనలలొ ఇది ఒకటి. “సెంటర్ ఫర్ మీడియా స్టడీస్” సర్వే ప్రకారం అవినీతిలొ మొదటిస్థానంలొ నిలిచిన కర్ణాటకలొని కూర్గ్ జిల్లాలొని అరమెరి గ్రామంలొ “కత్తెర సొమయ్య” అనే వ్యవసాయదారుడు, తన ఇంటి మరమ్మతుల కొసం సురేష్ నాయక్ అనే బేల్దారిని పిలిపించాడు. మైసూర్ కు చెందిన సురేష్ నాయక్, సొమయ్య ఇంటి మరమత్తులు చేస్తున్న సమయంలొ ఇంటి వెనుక ఐదు అడుగుల ఏత్తునున్న బాత్రూం పైకప్పుకు సిమెంట్ వేస్తున్న సమయంలొ దురద్రుష్టవశాత్తు కింద పడిపొయాడు. దీనితొ సొమయ్య వెంటనే సురేష్ నాయక్ ను హాస్పటల్ లొ జాయిన్ చేశారు.

కాని దురుద్రుష్టవశాత్తు తలకు బలంగా దెబ్బ తగలడంతొ సురేష్ నాయక్ హాస్పటల్ లొ చనిపొయారు. కాని మద్య తరగతి రైతు అయిన సొమయ్య మానవతాదృక్పదంతొ సురేష్ నాయక్ కుటుంబా ఆర్ధిక పరిస్థితి ద్రుష్టిలొ పెట్టుకుని సురేష్ నాయక్ కుటుంబానికి 50,000 ఆర్ధిక సహాయం చేయడమే కాకుండా, 20,000 హస్పటల్ ఖర్చులతొ పాటు సురేష్ దహనసంస్కారాలకు అయిన ఖర్చు మొత్తం సొమయ్యే భరించాడు. సురెష నాయక్ తండ్రి మహదేవ్ నాయక్ తొ సహా ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ప్రకారం ఈ సంఘటనను ప్రమాద వశాత్తు జరిగిన సంఘటనగా విరాజపేట రూరల్ పొలీసుస్టేషనులొ కేసు బుక్ అయ్యింది.

అయితే రెండు రొజుల తరువాత నుండి సొమయ్యకు సబిన్సపెక్టర్ ప్రవీణ్ నుండి బెదిరింపులు రాసాగాయి. పెద్ద గిఫ్ట్ ఏదైనా ఇవ్వనట్లయితే నీ మీద క్రిమినల్ కేసు నమొదు చేసి జైలుకు పంపిస్థామని తీవ్రస్థాయిలొ SI ప్రవీణ్ బెదిరిస్తుండటంతొ, చేసేది లేక 20,000 లంచం ఇచ్చి ప్రవీణ్ పీడ వదిలించుకున్నాడు. అయితే సొమయ్యకు ఆరొజు నిద్రపట్తలేదు. బాగా ఆలొచించి ఒక సరయిన నిర్ణయం తీసుకున్నాడు. వెంటనే ప్రధానమంత్రి గ్రీనెన్స్ పొర్టల్ కు ఆన్ లైన్లొ జరిగిన మొత్తం విషయాన్ని వివరించి కంప్లైంట్ చేశాడు. అంతే సరిగ్గా వారం రొజులకు SI ప్రవీణ్ స్వయంగ సొమయ్య ఇంటికి వచ్చి 20,000 తిరిగి ఇచ్చి క్షమాపణలు వేడుకున్నాడు. అంతేకాకుండా అతనిపై అవినీతి ఆరొపణలు మొపబడ్డాయి.

One thought on “మోదీ గారి దెబ్బకు బెదిరిపోయి, లంచం వెనక్కు ఇచ్చేసిన పొలీస్ అధికారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!