బయటపడ్ద పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకున్న సొరంగం!

Share the Post

లక్క ఇల్లు, దీనిని లక్ష్యగ్రుహ అని కూడా అంటారు … ఇది మహాభారతంలొ అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం … తనకు అడ్డుగా ఉన్న పాండవులను తెలివిగా హత్యచేసేందుకు కౌరవాగ్రజుడయిన దుర్యొధనుడు, తన మేనమామ శకునితొ కలిసి కపటొపాయం పన్నారు … ఇందుకొసం గంగా నది తీరానికి దగ్గరలొ ఉండే భర్నవ నగరం సమీపంలొ ఉన్న అడవులలొ లక్క, మట్టి నెయ్యిల మిశ్రమంతొ లక్క ఇంటిని (లక్ష్యగ్రుహ) నిర్మించి, అందులొ తెలివిగా పాండవులను సజీవదహనం చేయడానికి కుతంత్రం పన్నారు … ఈ భర్నవ నగరాన్ని అప్పటిలొ వర్నావతం అని పిలిచేవారు, ఈ వర్నావత్ (భర్నవ) నగరం అనేది అప్పటిలొ పాండవులు, కౌరవులను అడుగిన ఐదు ఊర్లలొ ఇది కూడా ఒకటి …. ఈ లక్క ఇంటి నిర్మాణం కొసం కౌరవరాజు ధుర్యొధనుడు, పురోచనుడు అనే గృహ నిర్మాణ నిపుణుడికి ఈ భాధ్యతను అప్పగించి, శరవేగంతొ లక్క ఇంటి నిర్మాణం పూర్తిచేయించాడు … తరువాత తన తండ్రి ద్రుతరాస్ట్రుడి ద్వారా కొంతకాలం పాండవులు అక్కడ విశ్రాంతి తీసుకునేలా ఒప్పించి, తల్లి కుంతితొ సహా పాందవులందరిని లక్క ఇంటికి పంపించారు … ఈ కుటిలొపాయాని తెలుసుకున్న పాండవ పక్షపాతి అయిన విదురుడు, లక్క ఇంటి నుండి పాండవులను కాపాడటానికి సొరంగ మార్గాన్ని తవ్వించాలని నిర్ణయించుకుంటాడు … ఇందుకొసం తన నమ్మినబంటు అయిన ఖనకుడి ని పాండవుల వద్దకు పంపిస్థాడు … విదురుని ఆగ్ణ ప్రకారం ఖనకుడు మూడవ కంటికి తెలియకుండా శరవేగంగా లక్క ఇంటి నుండి బయటకు సొరంగ మార్గాన్ని పూర్తిచేసి పాండవులకు అప్పగిస్థాడు … ఈ సొరంగ మార్గం పూర్తయిన వెంటనే పాండవులు తెలివిగా లక్క ఇంటిని తామే దహనంచేసి, ఆ రహస్య సొరంగ మార్గం ద్వారా తప్పించుకుంటారు … తరువాత ఈ సొరంగ మార్గం విషయం కౌరవులకు తెలియకుండా ఉండటం కొసం ఖనకుడు ఆ లక్క ఇంటి బూడిదతొ ఆ సొరంగ మార్గాన్ని మూసివేస్థాడు. ఇది చరిత్ర అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆర్కియాలజి డిపార్టుమెంటు వారు ఈ భరణవ ప్రాంతంలొని మట్టిలొ కూరుకుపొయిన ఈ రహస్య సొరంగ మార్గాన్ని ఇటీవల కాలం లొ కనిపెట్టడం విశేషం … ఈ సొరంగ మార్గం ద్వారా ఈ ప్రాంతంలొ ఉన్న లక్క ఇంటి ఆనవాళ్ళుతొ పాటు చరిత్రకు సంబందించిన అనేక రహస్యాలు కనుగొనవచ్చని అయితే ఈ సొరంగ మార్గం అనేక మలుపులు ఉండటం, అనేక ఇబ్బందులు ఉండటంతొ ఇప్పటి వరకు ఏవరూ ప్రవేశించలేకపొయారని ప్రొఫెసర్ క్రిష్ణకాంత్ శర్మ తెలియజేశారు … ఈ విషయంపైపై పూర్తిస్థాయిలొ స్టడి చేసిన ఆర్కియాలజి సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రదేశంలొ ఉన్న లక్క ఇంటి ఆనవాళ్ళు కనుగొనడం కొసం ఈనెల మొదటివారం నుండి ఇక్కడ పరిశొధనలు ప్రారంభించారు. దాదాపు మూడు నెలలపాటు ఇక్కడ పరిశొధనలు జరగనున్నాయి. ఇదే కాకుండా 2014 లొ ఈ భరణవ ప్రాంతానికి అతి దగ్గరలొ ఉన్న చాందయాన్, సినౌలి గ్రామాలలొ జరిగిన తవ్వకాలలొ ఇక్కడ పెద్ద ఏత్తున అస్తిపంజరాలు, కుండలతొ పాటు వజ్రాలు పొదిగిన కీరీటం కూడ భయటపడటం విశేషం.

One thought on “బయటపడ్ద పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకున్న సొరంగం!

  • December 15, 2017 at 10:32 am
    Permalink

    దీనిని వారణావతం అని అంటారు. ఇక వీటి ఆనవాళ్ళు ఉత్తరాఖండ్ లోని లాఖామండల్ వద్ద ఇప్పటికీ దర్శించవచ్చు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!