దేశసేవ కోసం లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలేసిన దినసరి కూలి కుమారుడు

Share the Post

డెహ్రాడూన్ లొని ప్రపంచ ప్రఖ్యాత ఇండియన్ మిలటరీ అకాడమి లొ పెద్ద ఏత్తున పేరేడ్ జరుగుతుంది … అది చూస్తున్న దినసరి కూలి అయిన “బర్నానా గున్నయ్య” కళ్ళు ఆనంద భాష్పాలతొ నిండిపొయాయి … చెప్పలేని ఆనందంతొ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు … ఏందుకంటే ఆ పేరేడ్ కు నేత్రుత్వం వహిస్తుంది సాక్ష్యాత్తూ గున్నయ్య కుమారుడైన “బర్నానా యాదగిరి”. ఇండియన్ మిలటరీ అకాడమీకి చెందిన టెక్నికల్ గ్రాడ్యుయేట్ కొర్సు లొ ప్రధమస్థానం సంపాదించిన యాదగిరి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సిల్వర్ మెడల్ ను స్వీకరిస్తున్నాడు … అప్పటి వరకు తన కుమారుడు ఏం చేస్తున్నాడొ కూడా తెలియని గున్నయ్యా, మిలటరీ ఆఫీసర్ డ్రస్సులొ తన కొడుకు మెడల్ తీసుకొవడం చూసే సరికి గున్నయ్య ఆనందానికి అవధులు లేకుండా పొయాయి. బర్నానా యాదగిరి, హైదరాబాదులొని ఒక సిమెంటు ఫ్యాక్టరీలొ రొజుకు 100 రూపాయల వేతనంతొ పనిచేసే దినసరి కూలీ అయిన బర్నానా గున్నయ్య కుమారుడు … చిన్నప్పటి నుండి “స్కాలర్ షిప్” తొ కస్టపడి చదువుకున్న యాదగిరి హైదరాబాదులొని ప్రఖ్యాత IIIT లొ బిటెక్ పూర్తి చేశాడు … కేంపస్ ఇంటర్యూలలొ యాదగిరి అమెరికాకు చెందిన మల్టీనేషన్ కంపెనీ అయిన “యూనియన్ ఫసిఫిక్ రైల్ రొడ్” లొ లక్షల జీతంతొ ఉద్యొగానికి సెలక్టైయ్యాడు … చిన్నప్పటి నుండి తీవ్ర కష్టాలను ఏదుర్కొన్న యాదగిరి డబ్బు కన్నా దేశానికే విలువనిచ్చి త్రుణప్రాయంగా ఆ ఉద్యొగాన్ని తిరస్కరించాడు … అంతేకాదు CAT Exams లొ 93.4% మార్కులు సంపాదించిన యాదగిరి “IIM-ఇండొర్” లొ వచ్చిన సీటును కూడా కాదనుకుని, IMA పరీక్షలు వ్రాసి ఇండియన్ మిలటరీ అకాడమిలొ జాయిన్ అయ్యారు. అదే దృడ సంకల్పంతొ అకాడమి ట్రైనింగ్ కొర్స్ లొ మొదటిస్థానం సంపాదించి సిల్వర్ మెడల్ సంపాదించాడు. ఈ సంధర్బంగా బర్నానా యాదగిరి మాట్లాడుతూ “అమెరికన్ కంపెనీలొ ఉద్యొగంలొ జాయిన్ అయినట్లయితే డబ్బును సంపాదించగలిగే వాడిని కాని జీవితంలొ ఏప్పటికీ ఆత్మసంతృప్తిని పొందలేకపొయేవాడిని. ఇప్పుడు మిలటరీలొ చేరడం వలన దేశానికి సేవ చేసే గొప్ప అవకాశం వచ్చింది. డిఫెన్స్ రిసెర్చ్ లొ నావంతు క్రుషి చేసి భరతమాత ఋణం తీర్చుకుంటానని తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!