గొవింద కొట్టనున్న భారత్ కు వ్యతిరేకంగా నిర్మిస్తున చైనా_పాక్ ఏకనామిక్ కారిడార్

Share the Post

పాకిస్థాన్ లొని గ్వాదర్ పొర్టు నుండి, చైనాలొని కష్గార్ నగరాల మద్య చైనా_పాకిస్థాన్ ఏకనామిక్ కారిడార్ ను నిర్మించాలని 2013 లొ పాకిస్థాన్, చైనా దేశాలు ఓప్పందం చేసుకున్నాయి. దీని విలువ 62 బిలియన్ డాలర్లు … రెండు దేశాల మద్య వ్యాపార_వాణిజ్య సంబందాలు మెరుగుపరచుకొవడానికి, పాకిస్థానులొ పెద్ద ఏత్తున పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి, పాకిస్థాన్ ప్రజలకు ప్రత్యక్షంగా 30 లక్షల ఉద్యొగావకాశాలు కల్పించడానికి ఈ కారిడార్ ను నిర్మిస్తున్నట్టు రెండు దేశాలు తెలియజేశాయి. కాని నిజానికి చైనా ఉదేశ్యం వేరు. POK మీదగా పొయే ఈ కారిడార్ ద్వారా భారతదేశాన్ని వాయువ్యం, పశ్చిమం వైపు చుట్టేయడానికి – గ్వాదర్ పొర్టు రక్షణ సాకు చూపించి చైనీస్ సబ్మెరైన్లు, యుధ నౌకలను అరేబియా, హిందూ మహా సముద్రాలలొకి అధికారికంగా ప్రవేశపెట్టడం ద్వారా భారత్ ను చక్రబందంలొ ఇరికించాలనేది చైనా వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. అయితే ఈ కారిడార్ గురించి మొదటి నుండి పాకిస్థాన్ ప్రజలలొ, మీడియా, మేధావులలొ అనేక సందేహలు, భయాందొళనలున్నాయి. చైనా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుండటం, పాకిస్థాన్ అధికారులను అసలు లెక్కచేయక పొవడం, పాకిస్థాన్ ప్రజలకు కనీసం గౌరవం ఇవ్వకుండ హీనంగా చూస్తుండటం అక్కడి పాక్ ప్రజలకు, మీడియాకు చైనాపై పెద్ద ఏత్తున వ్యతిరేకత వచ్చింది. దీనికి తొడు ఈ కారిడార్ కు గుండెకాయలాంటి బెలూచిస్థాన్, POK ప్రాంతాల స్వాతంత్ర్యానికి భారత ప్రధాని నరేంద్రమొది బహిరంగంగా మద్దత్తు తెలియజేయడంతొ, ఆయా ప్రాంతాలలొ ప్రజలు ఈ కారిడార్ కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలొ ఉద్యమించడం మొదలుపెట్టారు. దీనికి తొడు పటాన్ కొట్ ఆర్మి బేస్ పై తీవ్రవాదుల దాడి తరువాత భారత్, పాక్ ను ఏకాకిని చేసి, అంతర్జాతీయ బ్యాంకుల నుండి ఋణాలు రాకుండా అడ్డుకొవడం, అమెరికా కూడా నిధులు ఆపివేయడంతొ వేగంగా ఆర్ధిక సంక్షొభంలొకి కూరుకు పొతున్న పాకిస్థాన్ కు చైనా విధిస్తున్న ఖటినమైన ఆంక్షలు, షరతులు, కొత్త డిమాండ్లు పాకిస్థాన్ కు విసుగుతెప్పించాయి, దీనికి తొడు చైనా పని తీరు పాకిస్థాన్ కు అనేక అనుమానాలు కలించింది. దీనితొ నెల రొజుల క్రితం చైనా_పాకిస్థాన్ లు కలిసి నిర్మిస్తున్న అత్యంత కీలకమైన దైమర్ భాషా డ్యాం ప్రాజెక్టు నుండి పాకిస్థాన్ వైదొలగింది. అంతేకాకుండా గ్వాదర్ పొర్టులొ తమ కరెన్సీని ఉపయొగించాలన్న చైనా డిమాండ్ ను పాకిస్థాన్ నిర్ధ్వందంగా తొసిపుచ్చింది. తొ పాక్ పై ఆగ్రహంతొ ఉన్న చైనా “ఈ కారిడార్ నిర్మాణంలొ పెద్ద ఏత్తున అవినీతి జరుగుతుండటం, స్థానిక పాకిస్థానీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, మానవ హక్కుల సంఘాల నుండి పెద్ద ఏత్తున నిరసనల నేపధ్యంలొ ఈ కారిడార్ కు సంబందించిన అనేక ప్రాజెక్టులకు నిధులను ఆపివేసింది. దీనికి తొడు భారత వలన ఈ కారిడార్ కు ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న చైనా, ఈ ప్రాజెక్టును ఏక్కువకాలం సాగదీసి నెమ్మదిగా పక్కకు తప్పుకొవాని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ కారిడార్ నిర్మాణంలొ ఏం జరిగినా తన ప్రతిష్టకు బంగం వాటిల్లుతుందని చైనా భయపడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!