కుంభమేళ ను భారతీయ ‘సాంస్కృతిక వారసత్వ సంపదగా’ గుర్తించిన UNESCO

Share the Post

సంస్క్రుతి, సాంప్రదాయాలను నెలవైన భారతదేశం వేద భూమిగా ప్రసిధి చెందింది … ఆధ్మాత్మికానికి, శాంతి, సౌభ్రాతుత్వానికి నెలవైన భారతదేశ విశిష్టత గురించి చాలా కాలం వరకు ప్రపంచంలొ పెద్దగా గుర్తింపు లభించలేదనే చెప్పాలి … అయితే దేశాల, ప్రజల మద్య కమ్యునికేషన్ పెరగడం, వలసలు, ఇంటర్నెట్ , సామాజిక మాధ్యమాలు పెద్ద ఏత్తున అందుబాటులొకి రావడంతొ ఇప్పుడిప్పుడే భారతీయ పరిమళాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి … ఇప్పటికే 35 కు పైగా భారతదేశంలొని దేవాలయాలను, చారిత్రాత్మక ప్రదేశాలను గా గుర్తించిన యునెస్కొ, ఇప్పుడు హిందూ సంస్క్రుతిని చాటిచెప్పే అతి పెద్ద ఉత్సవమైన కుంభమేళా ను యునెస్కొ cultural heritage of humanity గా గుర్తించింది … కుంభమేళా గురించి భారతదేశంలొనే అనేక మంది విమర్శలు, హేళనలు చేస్తున్న సమయంలొనే యునెస్కొ కుంభమేళా ను గొప్ప ప్రాధాన్యతనిచ్చి, cultural heritage గా గుర్తించడం విసేషం … దీనితొ అనేకమంది విమర్శకుల నొతికి తాళం పడినట్లయింది. కుంభమేళా అనేది లక్షల సంఖ్యలొ హిందువులు ఒక చోటకు చేరుకునే జరుపుకునే అతి పెద్ద ఉత్సవం. సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభ మేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో మరియు పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది. 2001లో జరిగిన మహా కుంభ మేళాకు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం. కాగా కుంభమేళాను యునెస్కొ cultural heritage of humanity గా గుర్తించడాన్ని భారత ప్రభుత్వం ఆహ్వానించింది. ఇవి గర్విచదగ్గ గొప్ప క్షణాలుగా భారతప్రభుత్వం పేర్కొంది. కుంభమేళా ప్రపంచంలొనే కుల,మత, లింగ బేధాలు లేకుండా శాంతియుతంగా జరిగే అతి పెద్ద ఉత్సవమని, ఈసారి మరింత ఘనంగా కుంభమేళాను నిర్వహిస్థామని భారత ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!