కాశ్మీరులొ లష్కరేతొయబా అగ్ర నాయకత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టిన ఇండియన్ ఆర్మీ

Share the Post

లష్కరే తొయబా, పాకిస్థాన్ కు చెందిన అతి పెద్ద ఉగ్రవాద సంస్థ. కాశ్మీరులొ జరిగే దాదాపు 70% హింసాత్మక సంఘటనలకు కారణం ఈ ఉగ్రవాద సంస్థే. దీనికి నిధులు కూడా పెద్ద మొత్తంలొ అందుతుంటాయి. దీనికి తొడు కాశ్మీరులొని వేర్పాటు వాదుల అండదండలు పుష్కలంగా ఉండటంతొ మొన్నటి వరకు కాశ్మీరులొ అడ్డూఅదుపు లేకుండా చెలరేగిపొయింది. పెద్ద ఏత్తున హింసాత్మక సంఘటనలను కొనసాగిస్తూ కాశ్మీరు లొయలొ తిరుగులేని ఆధిపత్యం సాధించిన లష్కరే తొయబా, ఇప్పుడు తన అస్తిత్వం కొరకు పొరాడుతుంది. ప్రస్తుతం కొన ఊపిరితొ వెంటిలేటర్ పై ఉంది. గత మూడు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం తీవ్రవాదంపై ఉక్కుపాదం మొపడం, తీవ్రవాదుల విషయంలొ భద్రతాదళాలకు పూర్తి స్వచ్చనివ్వడంతొ ఇండియన్ ఆర్మీ జూలు విదిలించింది. ఇందుకొసం కొత్త ఆపరేషన్ ను ప్రారంభించింది. దాని పేరే ” Operation All Out “. పక్కా స్కెచ్ తొ ముందుకు దూకింది. ముందుగా కాశ్మీరులొని యాక్టివ్ గా ఉండే తీవ్రవాదులను, టాప్ కమాండర్లను, వారి ప్రాంతాలను గుర్తించి వేట మొదలు పెట్టింది. అనుమానమున్న ప్రతి ప్రాంతంలొ పెద్ద ఏత్తున కార్డన్ & సెర్చ్ ఆపరేషన్లు ప్రారంభించింది, పూర్తిస్థాయిలొ టెక్నాలజిని ఉపయొగించాయి, తీవ్రవాదులకు నిధులు అందకుండా బ్లాక్ చేశారు, అనుమానమున్న ప్రతి గ్రామంపై ద్రుష్టి సారించారు. దీనితొ చేపలు వలలొ పడటం ప్రారంభించాయి. దీనితొ కాశ్మీరులొని లష్కరేతొయబా సుప్రీం కమాండర్ అబ్ధులా మక్కి, రెండవ కీలక నాయకుడైన ఆబుదుజానే తొ సహా, బుర్ఖాన్ వాణికి అత్యంత సన్నిహితుడైన సబ్జార్ అహమ్మద్, 2008 ముంబాయి దాడుల మాస్టర్ మైండ్ జాకీర్ లఖ్వి మేనల్లుడు ఒవైద్, లస్కరే తొయబాలొ టాప్ కమాండర్లయిన మహమ్మద్ భాయ్, అబుహాన్స్, వసీం షా, షౌకత్ అహమ్మద్, ఆబు జుబైర్, హఫీజ్ నైజర్లతొ సహా లష్కరే తొయబాకు చెందిన మొత్తం అగ్రనాయకులను భారత భద్రతా దళాలు వేటాడి నరకానికి పార్శిల్ చేసాయి. దీనితొ లష్కరేతొయబా నెట్వర్క్ అంతా కకావికలమై పొయింది. ఈ సంవత్సరంలొ ఇప్పటివరకు జరిగిన ఏంకౌంటర్లలొ చనిపొయిన 200+ తీవ్రవాదులలొ దాదాపు 60% మంది లష్కరే తొయాబాకు చెందిన వారే ఉండటం విశేషం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!